TS DGP: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేసిన ఈసీ... కారణం ఇదే

EC reportedly suspends Telangana DGP

  • కౌంటింగ్ ప్రారంభం నుంచే కాంగ్రెస్ హవా
  • రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ 
  • డీజీపీ చర్యను నిబంధనల ఉల్లంఘన కింద భావించిన ఈసీ

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని ఈసీ భావించినట్టు సమాచారం. కాగా, ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే కాంగ్రెస్ హవా స్పష్టమైంది. ఈ క్రమంలో, డీజీపీ అంజనీకుమార్, మరికొందరు ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రేవంత్ కు పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

TS DGP
Anjani Kumar
Suspension
EC
  • Loading...

More Telugu News