Komatireddy Raj Gopal Reddy: తన ఆశయం... లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉంది: కోమటిరెడ్డి

Komatireddy talks about his winning

  • మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి
  • ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణలో ఓ కుటుంబం దోచుకుందని విమర్శలు
  • అవినీతి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్య

తన ఆశయం... లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిసెంబర్ 3న తెలంగాణ ప్రజల నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణలో ఒక కుటుంబం దోచుకుందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు బహుమతి ఇచ్చారన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Telangana Assembly Results
Congress
  • Loading...

More Telugu News