Raja Singh: గోషామహల్ నుంచి హ్యాట్రిక్ కొట్టిన రాజాసింగ్

Rajasingh won GoshaMahal

  • సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్‌పై 21వేల పైచిలుకు ఓట్లతో గెలుపు
  • నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ గెలుపు
  • ఇప్పటి వరకు ఐదింట గెలిచి.. మూడింట ముందంజలో ఉన్న బీజేపీ

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. రాజాసింగ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌పై 21,312 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందారు. బీజేపీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. ఆర్మూర్, నిర్మల్, ముథోల్, నిజామాబాద్ అర్బన్ తో పాటు హైదరాబాద్ లోని గోషామహల్ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఇప్పటివరకు ఐదు సీట్లలో గెలిచింది. మూడు స్థానాలలో ముందంజలో ఉంది.

నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజ‌కవ‌ర్గం నుంచి 45 వేలపై చిలుకు ఓట్లతో గెలిచారు. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్‌పై 26,387 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Raja Singh
BJP
Telangana Assembly Results
  • Loading...

More Telugu News