DK Shivakumar: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ప్రజలు ఓటు ద్వారా కృతజ్ఞతలు తెలిపారు: డీకే శివకుమార్

DK Shivakumar talks about results

  • తెలంగాణలో కాంగ్రెస్ దే పైచేయి
  • స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్
  • తెలంగాణ ఓటర్లు మార్పును కోరుకున్నారన్న డీకే శివకుమార్

తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు సాధిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ సాధించిన విజయం కాదని, ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయం అని అభివర్ణించారు. తెలంగాణ ఓటర్లు మార్పును కోరుకున్నారని తెలిపారు. 

ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారని డీకే శివకుమార్ వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కృషి చేశారని వెల్లడించారు.

ఇక, తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని అధికారికంగా ప్రకటించాక, తదుపరి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. డీకే శివకుమార్ గతరాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఓ హోటల్ నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు.

DK Shivakumar
Congress
Results
Telangana Assembly Election
  • Loading...

More Telugu News