katipalli venkata ramana reddy: కామారెడ్డిలో ముందంజలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి... రెండో స్థానంలో రేవంత్, మూడోస్థానంలో కేసీఆర్

BJPs katipalli venkataramana reddy lead in Kamareddy

  • 13 రౌండ్ల వరకు 625 ఓట్ల ముందంజలో రేవంత్ రెడ్డి
  • 14వ రౌండ్ పూర్తయ్యేసరికి 2,100 ఓట్ల మెజార్టీతో కాటిపల్లి
  • సీఎం, టీపీసీసీ చీఫ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి కామారెడ్డి పైనే..!

కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముందంజలోకి వచ్చారు. పదమూడు రౌండ్లు ముగిసేసరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 625 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే 14వ రౌండ్‌లో అనూహ్యంగా వెంకటరమణారెడ్డి లీడ్‌లోకి వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. 

ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిలవడంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారనే వాదన మొదటి నుంచి ఉంది. అందుకు తగినట్లుగా కేసీఆర్ దాదాపు ఏ దశలోనూ ఇక్కడ ముందంజలో కనిపించలేదు. మొదటి పదమూడు రౌండ్లు రేవంత్ లీడ్‌లో నిలిచారు. కానీ పద్నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 2,100 ఓట్ల ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.

katipalli venkata ramana reddy
BJP
KCR
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News