vivek venkataswamy: బాల్క సుమన్‌ పరాజయం... చెన్నూరు విజేత వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy wins from Chennur

  • సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్‌పై 37,189 ఓట్లతో వివేక్ గెలుపు
  • బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ఘన విజయం
  • వివేక్ బ్రదర్స్ విజయం సాధించడంతో కార్యకర్తల సంబరాలు

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై 37,189 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. 

మరోవైపు, బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వివేక్ వెంకటస్వామి సోదరుడు గడ్డం వినోద్ కూడా ఘన విజయం సాధించారు. వినోద్ బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నం దుర్గయ్యపై గెలుపొందారు. వివేక్ బ్రదర్స్ ఇద్దరూ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

vivek venkataswamy
chennuru
BRS
Congress
  • Loading...

More Telugu News