Revanth Reddy: కొడంగల్ లో భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి ఘనవిజయం

Revanth Reddy wins Kodangal constituency

  • 30 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో రేవంత్ విక్టరీ
  • కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి ఓటమి
  • కౌంటింగ్ కేంద్రం నుంచి ముందే వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. కొడంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ దే పైచేయి అయింది. ప్రతి రౌండ్ లోనూ రేవంత్ రెడ్డికే ఆధిక్యం వస్తుండడంతో, పట్నం నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ముందే వెళ్లిపోయారు. అన్ని రౌండ్ల లెక్కింపు ముగిశాక రేవంత్ రెడ్డి 30 వేల ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 

రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనా పోటీ చేశారు. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ కూడా రేవంత్ ఆధిక్యంలో ఉన్నారు. 11 రౌండ్ల లెక్కింపు అనంతరం రేవంత్ ఆధిక్యం 3,335 ఓట్లకు పెరిగింది. మధ్యలో ఓసారి సీఎం కేసీఆర్ లీడింగ్ లోకి వచ్చినా రేవంత్ మళ్లీ పుంజుకున్నారు. 

Revanth Reddy
Kodangal
Congress
Patnam Narendar Reddy
Assembly Elections
Telangana
  • Loading...

More Telugu News