Ramagundam: రామగుండంలో కాంగ్రెస్ జెండా.. మక్కాన్ సింగ్ గెలుపు

Congress party secured another seat

  • మూడో సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే
  • చార్మినార్ నుంచి గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి
  • జుల్ఫికర్ అలీ విజయం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతాలో మరో సీటు చేరింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై ఘన విజయం సాధించారు. మక్కాన్ సింగ్ గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలో మూడు సీట్లు చేరాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి కొట్టింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ గెలుపొందారు.

Ramagundam
Makkan singh
Congress
MIM
Charminar
julfikhar ali
  • Loading...

More Telugu News