Balka suman: చెన్నూరులో బాల్క సుమన్ వెనుకంజ

Vivek venkataswamy leads in chennuru

  • స్వల్ప ఆధిక్యంలో దూసుకెళుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
  • తొలి రౌండ్ లో వివేక్ కు 312 ఓట్ల మెజారిటీ
  • ఆదిలాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వెనకబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకట స్వామి లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి బాల్క సుమన్ కంటే 312 ఓట్ల లీడ్ తో వివేక్ కొనసాగుతున్నారు. కాగా, ఆదిలాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల హోరాహోరీ కొనసాగుతోంది. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు చెరో నాలుగు చోట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. జిల్లాలో కేవలం రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Balka suman
vivek
BRS
Congress
vivek lead
Telangana
Election Results
chennuru
  • Loading...

More Telugu News