Uttam Kumar Reddy: కేసీఆర్ కేబినెట్ మీటింగ్ దీనికోసమేనేమో: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదన్న ఉత్తమ్
- తమ గెలుపు ధ్రువపత్రాలను చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని వెల్లడి
- రాజీనామాలు సమర్పించేందుకు కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టారేమోనని ఎద్దేవా
రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ వికాస్ రాజును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలిశారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం చెల్లించకుండా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. రైతుబంధు నిధులను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించాలని కోరారు. అసైన్డ్ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించకుండా చూడాలని విన్నవించారు. అసైన్డ్ భూముల రికార్డులను మార్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.