Ragging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Ragging In Kurnool Medical College

  • యూజీసీకి ఫిర్యాదు చేసిన జూనియర్ విద్యార్థులు
  • రికార్డులు రాసిపెట్టాలని వేధిస్తున్నట్లు ఆరోపణ
  • భోజనం తీసుకురావాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదు

కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్ హాస్టల్ లో గంజాయి, మద్యం సీసాలు బయటపడడం సంచలనం సృష్టించింది. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.

జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాంగింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ రికార్డులు రాసి పెట్టాలని, తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలగజేసుకోవాలని, తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు. ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసీ.. ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. కాలేజీలో, విద్యార్థుల హాస్టల్స్ లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Ragging
KMC
UGC
Kurnool
Medical College
Andhra Pradesh
  • Loading...

More Telugu News