Barrelakka: బర్రెలక్క స్ఫూర్తిగా.. ధర్మవరం బరిలో దిగుతానంటున్న ‘జుమ్ చక జుమ్ చక’ స్టార్

Youtube star Dasari Kavitha ready to fray AP elections

  • నిరుద్యోగుల ప్రతినిధిగా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క
  • ఆమె స్ఫూర్తిగా బరిలోకి దాసరి కవిత 
  • కేతిరెడ్డిని ఓడించడమే లక్ష్యమన్న యూట్యూబ్ స్టార్
  • 10 హామీలతో మేనిఫెస్టో కూడా విడుదల

బర్రెలక్క.. ఇప్పుడీ పేరు ఓ సంచలనం. రీల్స్ చేసుకునే ఈ అమ్మాయి తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బరిలోకి దిగి రాత్రికి రాత్రే దేశమంతటా సంచలమైంది. నిరుద్యోగుల గొంతుకగా తాను బరిలోకి దిగినట్టు చెప్పిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు విపరీతమైన మద్దతు లభించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్ వెళ్లి ఆమె తరపున ప్రచారం చేశారు. మరెంతోమంది ప్రచారానికి ముందుకొచ్చారు. సరిహద్దుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఆమెకు అండగా నిలిచారు.

ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న ఎంతోమంది వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఆంధప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ ‘జుమ్ చక జుమ్ చక’ యూట్యూబ్ స్టార్. అంతేకాదు, పది హామీలతో మేనిఫెస్టో కూడా రూపొందించింది. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని కవిత పేర్కొంది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Barrelakka
Karne Sirisha
Youtube Star
Kollapur
Dasari Kavitha

More Telugu News