Telangana cabinet: డిసెంబర్‌ 4న తెలంగాణ కేబినెట్ భేటీ: ముఖ్యమంత్రి కార్యాలయం

Telangana cabinet meeting on December 4

  • 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • డిసెంబర్ 3న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు

డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. 

మరోవైపు 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలపై మంత్రి కేటీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.

Telangana cabinet
Meeting
KCR
BRS
  • Loading...

More Telugu News