Chandrababu: తిరుమలలో శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకున్న చంద్రబాబు, నారా భువనేశ్వరి

Chandrababu visits Sri Varaha Swamy Temple in Tirumala

  • తిరుమల విచ్చేసిన చంద్రబాబు
  • రేపు ఉదయం శ్రీవారి దర్శనం
  • అనంతరం విజయవాడ పయనం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుమల విచ్చేశారు. తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలలోని శ్రీ వరాహస్వామి వారి దర్శనం చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన చంద్రబాబు స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు రేపు (శుక్రవారం) ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. చంద్రబాబు విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, సింహాచలం క్షేత్రాలను కూడా సందర్శిస్తారని తెలుస్తోంది. 

Chandrababu
Nara Bhuvaneswari
Sri Varaha Swamy Temple
Tirumala
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News