Hyper Aadi: అప్పులు తీర్చడం కోసం పొలం అమ్మేశాం: హైపర్ ఆది

Hyper Adi Special

  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన ఆది 
  • ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ
  • తండ్రి చేసిన అప్పు గురించిన ప్రస్తావన 
  • మాట పడటం ఇష్టం ఉండదని వెల్లడి


'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో 'హైపర్ ఆది' ఒకరు. హైపర్ ఆది పంచ్ ల కోసమే ఆయన స్కిట్స్ ను ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు. ఈ షో ద్వారానే ఆయన రచయితగాను .. నటుడిగాను వెండితెరకి పరిచయమయ్యాడు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

"కాలేజ్ రోజుల్లో నేను మిమిక్రీ చేసేవాడిని .. అలాగే ఇమిటేట్ చేసేవాడిని. పంచ్ లు వేయడం కూడా అప్పటి నుంచే ఉంది. ఇక నటన విషయానికి వస్తే, మా నాన్న నాటకాలు వేసేవాడు. ఆయనను చూస్తూ పెరగడం వలన, ఆయన నుంచి నటన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అన్నాడు. 

" మేము ముగ్గురం అన్నదమ్ములం .. మా చదువుల కోసం మా నాన్న 20 లక్షల వరకూ అప్పుచేశాడు. నేను జాబ్ చేయడం వలన వచ్చిన డబ్బు,  వడ్డీలు కట్టడానికి సరిపోయేది. ఇలా ఎంతకాలం అనిపించింది .. మాట పడటం ఇష్టం లేక, మాకున్న 3 ఎకరాలు అమ్మేశాము. కాకపోతే ఈ విషయంలో మా అమ్మానాన్నలను ఒప్పించడం కొంచెం కష్టమైంది అంతే" అని చెప్పాడు.

Hyper Aadi
Actor
Tollywood
  • Loading...

More Telugu News