Prabhas: ఇటు ప్రభాస్ .. అటు కమల్: 'కల్కి 2898 AD' అప్ డేట్!

- ప్రభాస్ పాన్ ఇండియా మూవీగా 'కల్కి'
- కీలకమైన పాత్రను పోషిస్తున్న కమల్
- హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. గతంలో ఈ బ్యానర్ పై ఎన్నో భారీ సినిమాలు వచ్చాయి. వాటన్నిటిని మించిన బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించడం విశేషం. ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు. కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
