Ravichandran Ashwin: రోహిత్ శర్మ మనస్తత్వం ఎలాంటిదో చెప్పిన అశ్విన్

Ashwin opines on Rohit Sharma leadership

  • రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడిన అశ్విన్
  • జట్టులోని ప్రతి ఒక్కరిని అర్ధం చేసుకునే వ్యక్తి అని కితాబు
  • నాయకత్వానికి సంబంధించి రోహిత్ శర్మ స్థాయి ఓ మెట్టు పైనే ఉంటుందని వెల్లడి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మది అద్భుతమైన వ్యక్తిత్వం అని కొనియాడాడు. జట్టులోని ప్రతి సభ్యుడ్ని అర్థం చేసుకోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నిస్తుంటాడని వివరించాడు. ఎవరికి ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో రోహిత్ శర్మకు తెలుసని, అతడు గొప్ప ఆలోచనా శక్తి ఉన్నవాడని కితాబునిచ్చాడు. 

జట్టులోని ప్రతి ఆటగాడికి వ్యూహాలను, ఎత్తుగడలను బోధపర్చడం ఎలాగో రోహిత్ శర్మను చూసి తెలుసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు. నాయకత్వానికి సంబంధించి మిగతావాళ్లకంటే రోహిత్ శర్మ చాలా ముందున్నాడని, తాను ఏం మాట్లాడతాడో అదే చేస్తాడని, తానేంటో తను ఏంటో బ్యాట్ ద్వారా చాటిచెబుతాడని వివరించాడు.

Ravichandran Ashwin
Rohit Sharma
Captaincy
Team India
  • Loading...

More Telugu News