Eesha Rebba: అందం .. ఆకర్షణ ఆమె సొంతం: ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్

- తెలుగు తెరపై తక్కువగా కనిపించే తెలుగు హీరోయిన్స్
- కొంతవరకూ సక్సెస్ అయినవారు కొందరే
- అంజలి .. స్వాతిరెడ్డి .. బిందుమాధవి ఆ జాబితాలోవారే
- పట్టుదలతో ముందుకు వెళుతున్న ఈషా రెబ్బా
- సరైన హిట్ కోసమే ఆమె వెయిటింగ్
ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలుగు ప్రాంతానికి చెందిన .. తెలుగు భాష వచ్చిన హీరోయిన్స్ మాత్రమే కనిపించేవారు. అందువలన తెలుగు కథలలో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉండేది. ఆ తరువాత కాలంలో తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ జోరు పెరుగుతూ పోయింది. ఒక దశ తరువాత తమిళ .. మలయాళ భామల రాక ఎక్కువైంది. అక్కడి హీరోయిన్స్ ఇక్కడ చక్రం తిప్పడం మొదలైంది.


