Kiraak RP: ఓ ఇంటివాడైన కిరాక్ ఆర్పీ.. లవర్ మెడలో సీక్రెట్‌గా మూడుముళ్లు!

Kiraak RP Secretly Tied Knot With His Lover In Vizag

  • ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న అమ్మాయితో లవ్
  • ఏడాదిన్నర క్రితమే ఎంగేజ్‌మెంట్
  • వైజాగ్‌లో బంధుమిత్రుల సమక్షంలో వివాహం

జబర్దస్ నటుడు కిరాక్ ఆర్పీ ఓ ఇంటివాడయ్యాడు. టీం మెంబర్‌గా ప్రవేశించి ఆ తర్వాత లీడర్ స్థాయికి ఎదిగిన ఆర్పీ ఆ తర్వాత షో నుంచి బయటకు వచ్చేశాడు. దర్శకుడిగా ఓ సినిమా మొదలుపెట్టినా అది పట్టాలు ఎక్కలేదు. దీంతో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో కర్రీ పాయింట్లు పెట్టి సక్సెస్ అయ్యాడు. 

తాజాగా ఈ నెల 29న బంధుమిత్రుల సమక్షంలో వైజాగ్‌లో సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కాడు. ఐఏఎస్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో గతంలో లవ్‌లో పడిన ఆర్పీ తల్లిదండ్రులను ఒప్పించి తాజాగా ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన వీరి నిశ్చితార్థానికి అప్పట్లో పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Kiraak RP
Jabardasth
Kiraak RP Marriage
Visakhapatnam
  • Loading...

More Telugu News