EVM: నారాయణపూర్ లో మొరాయించిన ఈవీఎంలు

EVMs Not working in Narayanpur

  • ఇల్లందులోని బయ్యారంలో నిలిచిన ఓటింగ్
  • ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలు ఓటర్ల పడిగాపులు
  • టెక్నీషియన్ సరిచేయడంతో మళ్లీ మొదలైన పోలింగ్

తెలంగాణలో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో 43 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఇందులో నారాయణపురం పంచాయతీ పరిధిలోని 6వ నెంబర్ పోలింగ్ బూత్ లో సమస్య ఏర్పడింది. ఈవీఎం మొరాయించడంతో అధికారులు పోలింగ్ ఆపేశారు.

ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 2 గంటల పాటు ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద పడిగాపులు కాశారు. అక్కడే అందుబాటులో ఉన్న టెక్నీషియన్ ఈవీఎంను రిపేర్ చేయడంతో మళ్లీ పోలింగ్ మొదలైంది. ఈ ఘటనపై మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఇమ్మాన్యుయెల్ స్పందిస్తూ.. నారాయణపురం ఈవీఎం మొరాయించిన విషయం తెలిసిన వెంటనే స్పందించామని చెప్పారు. అక్కడికి ఓ టెక్నీషియన్ ను పంపించినట్లు తెలిపారు.

EVM
Polling
Telangana
Elections
Narayanpur
voting
  • Loading...

More Telugu News