Narendra Modi: తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ.. మోదీ, ప్రియాంకాగాంధీ ట్వీట్లు

Modi and Priyanka Gandhi tweets on Telangana election day

  • ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలన్న మోదీ
  • మొదటసారి ఓటు వచ్చిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు
  • తెలంగాణ కలను సాకారం చేసి చూపాలన్న ప్రియాంకాగాంధీ

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా కొనసాగుతోంది. మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయ కార్యర్శి ప్రియాంకా గాంధీలు ఎక్స్ వేదికగా స్పందించారు. 

'తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను' అని ప్రధాని చెప్పారు. 

ప్రియాంకాగాంధీ స్పందిస్తూ..  'నా తెలంగాణ సోదర సోదరీమణులారా...  మా తల్లులారా... పిల్లలారా... మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్' అని ట్వీట్ చేశారు.

Narendra Modi
BJP
Priyanka Gandhi
Congress
Telangana Elections
  • Loading...

More Telugu News