Japan: జపాన్ సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

USA aircraft collapses in Japan sea

  • జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఘటన
  • మధ్యాహ్నం 2.47కి కూలిపోయిన విమానం
  • విమానం కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన కోస్ట్ గార్డ్స్

అమెరికాకు చెందిన యుద్ధ విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. విమానం కుప్పకూలిన విషయాన్ని కోస్ట్ గార్డ్స్ ధ్రువీకరించారు. మరోవైపు విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై అమెరికా డిఫెన్స్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు విమానంలో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు. 

Japan
USA
Air craft
  • Loading...

More Telugu News