Dhootha: ఉత్కంఠను పెంచుతున్న 'దూత' సిరీస్ .. కీలకమైన అంశం ఇదే!

Dhootha Web Series Update

  • విక్రమ్ కుమార్ నుంచి 'దూత'
  • వరుస హత్యల చుట్టూ తిరిగే కథ 
  • జర్నలిస్టు పాత్రలో కనిపించనున్న చైతూ
  • ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  


నాగచైతన్య హీరోగా 'దూత' వెబ్ సిరీస్ రూపొందింది. తన కెరియర్లో ఆయన చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇదే. శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సిరీస్ కి, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ నుంచి అప్ డేట్స్ వదులుతున్న దగ్గర నుంచి అందరిలో మరింతగా ఆసక్తి పెరుగుతూ పోతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు భాషల్లో 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సిరీస్ కంటెంట్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ కనిపించనున్నాడు. ఆయన 'సమాచార్' అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. నగరంలో జరుగుతున్న  వరుస హత్యలకు సంబంధించిన ఒక 'క్లూ' అతనికి దొరుకుతుంది. దాంతో ఆ మిస్టరీని ఛేదించడానికి ఒక జర్నలిస్టుగా రంగంలోకి దిగుతాడు.

అయితే కొన్ని అనూహ్యమైన పరిణామాల వలన అతనే నేరస్థుడిగా నిలబడిపోవలసి వస్తుంది. అతను అలా చిక్కుల్లో పడటానికి కారకులు ఎవరు? ఆ చిక్కుల్లో నుంచి అతను ఎలా బయటపడతాడు? అనే అంశాలే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రియా భవాని శంకర్ .. పార్వతీ తిరువోతు .. ప్రాచీ దేశాయ్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

Dhootha
Nagachaitanya
Priya Bhavani Shankar
Tarun Bhaskar
  • Loading...

More Telugu News