: జాక్ పాట్ కొట్టిన బామ్మ గారు


84 ఏళ్ల వయసు. జీవిత చరమాంకంలో చెవిన పడిన ఒక వార్త ఆమెకు మరింత ఆయువును ఇచ్చేలా చేసింది. గ్లోరియా మెకెంజీ అనే బామ్మ అమెరికాలోని జెఫిర్ హిల్స్ అనే చిన్న పట్టణంలో ఇంటికి కావాల్సిన సరుకులు కొంటూనే ఓ లాటరీ టికెట్ కూడా తీసుకుంది. సరిగ్గా అదే టికెట్ కు 59 కోట్ల డాలర్ల బహుమానం దక్కడంతో గ్లోరియాలో పట్టరానంత ఆనందం ఉరకలేస్తోంది. అమెరికాలో రెండో అతిపెద్ద జాక్ పాట్ గా చెప్పుకునే పవర్ బాల్ లాటరీ గ్లోరియా బామ్మను ఐశ్వర్యవంతురాలిని చేసింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఆమెకు వచ్చిన బహుమానం సుమారుగా 3304 కోట్ల రూపాయలు. ఎన్ని తరాలు కూర్చుని తింటే కరగాలి చెప్పండి?

  • Loading...

More Telugu News