Trivikram Srinivas: పాన్ ఇండియా రేంజ్ లోనే బన్నీతో త్రివిక్రమ్ మూవీ!

Allu Arjun in Trivikram Movie

  • మహేశ్ మూవీతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ 
  • ఆ తరువాత ప్రాజెక్టు అల్లు అర్జున్ తో 
  • ఇది పాన్ ఇండియా ప్రాజెక్టని చెప్పిన బన్నీ వాసు
  • ఈ లోగా బోయపాటితో ఉండొచ్చని వెల్లడి


త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలంతా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కథల్లో అన్ని వర్గాల ఆడియన్స్ కి కావలసిన అంశాలు ఉంటాయి. అందువలన అంతా ఆయన సినిమాలు చూడటానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు దాదాపుగా సక్సెస్ అవుతాయనే ఒక నమ్మకం కూడా అందరిలో ఉంది. 

అలాంటి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇంతవరకూ మూడు సినిమాలు చేశాడు. ఆ జాబితాలో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు కనిపిస్తాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను సాధించాయి. వసూళ్ల పరంగాను రికార్డులు సృష్టించాయి. ఇదే కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. 

అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్వరలోనే త్రివిక్రమ్ మొదలెట్టనున్నాడని తాజా ఇంటర్వ్యూలో బన్నీ వాసు చెప్పాడు. అంటే మహేశ్ బాబు సినిమా తరువాత త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్టు ఇదేనని అనుకోవాలి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందనే క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఈ లోగానే బోయపాటితో అల్లు అర్జున్ సినిమా ఉండొచ్చునని కూడా బన్నీ వాసు అన్నాడు.

Trivikram Srinivas
Allu Arjun
Bunny Vasu
  • Loading...

More Telugu News