Nara Lokesh: జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి: లోకేశ్

Lokesh held meeting with aqua farmers

  • కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం
  • లోకేశ్ కు వినతిపత్రం సమర్పించిన ఆక్వా సాగుదారులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. 

టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని.... సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. 

కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు.

Nara Lokesh
Aqua Farmers
Yuva Galam Padayatra
TDP
Dr BR Ambedkar Konaseema District
  • Loading...

More Telugu News