: ముగిసిన పెళ్లి ముచ్చట.. చవాన్ మళ్లీ జైలుకు!
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు అంకిత్ చవాన్ కు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నేటితో తీరిపోతుంది. తన స్నేహితురాలిని పెళ్లాడేందుకు కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో తీరిపోతున్నందున చవాన్ ఈ రోజు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో లొంగిపోనున్నాడు. అనంతరం అతడిని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇదే కేసులో అరెస్టయిన తోటి క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా అక్కడే రిమాండ్ లో ఉన్నారు.