Bigg Boss: 'బిగ్ బాస్' కి నేను కప్పు కోసం వచ్చాను .. కాఫీ కోసం కాదు: యావర్ పై శోభా ఫైర్

- బిగ్ బాస్ హౌస్ లో 85వ రోజు
- వేడిగా జరిగిన నామినేషన్స్
- శివాజీ ధోరణిని తప్పుబట్టిన గౌతమ్
- ప్రియాంక కోపం గురించి ప్రస్తావించిన శివాజీ
- జనాలు చూస్తున్నారంటూ అసహనం
బిగ్ బాస్ హౌస్ లో 85వ రోజున నామినేషన్స్ కాస్త వేడిగానే జరిగాయి. నామినేషన్స్ విషయంలో వాదనలు గట్టిగానే జరిగాయి. శివాజీని నామినేట్ చేసిన గౌతమ్ అతని ధోరణిని తప్పుబట్టాడు. "మీ చుట్టూ తిరుగుతూ .. మిమ్మల్ని ఎవరైతే పొగుడుతూ ఉంటారో వాళ్లని మీరు సపోర్టు చేస్తారు .. మిగతా వాళ్లను నామినేట్ చేస్తారు. నా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు" అన్నాడు. "నువ్వు ఫెయిర్ కాదని ఇప్పుడు చెబుతున్నాను'' అంటూ శివాజీ అసహనాన్ని ప్రదర్శించాడు.

