Santhoshi: 'ఆర్య'లో హీరోయిన్ గా నేను చేయవలసింది: 'జై' సినిమా హీరోయిన్

Santhoshi Interview

  • చాలాకాలం క్రితం తేజ నుంచి వచ్చిన 'జై' సినిమా 
  • ఆ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సంతోషి
  • 'జై' సెట్ లో అలా జరిగేదని వెల్లడి 
  • అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదని వ్యాఖ్య

తేజ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'జై' ఒకటి. తెలుగు తెరకి ఆయన పరిచయం చేసిన కథానాయికలలో సంతోషి ఒకరు. 'జై' తరువాత ఆమె తెలుగులో మూడు నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. 2007 తరువాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. శివ శ్రీకర ప్రసాద్ ను ఆమె వివాహం చేసుకుంది. అతను సీనియర్ ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు తనయుడే.

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "మా నాన్నగారిది విజయవాడ ..  నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. తేజ గారి దర్శకత్వంలోనే తెలుగులో ఫస్టు మూవీగా 'జై' చేశాను. ఆయితే అదే సమయంలో 'ఆర్య' సినిమా చేసే ఛాన్స్ కూడా వచ్చింది. దిల్ రాజు గారు వచ్చి .. తేజగారితో మాట్లాడారు. అయితే 'జై' సినిమాలోని పాత్రకి నేను కరెక్టు అని తేజ గారు అన్నారు. అందువలన 'ఆర్య' చేయలేకపోయాను" అని అన్నారు. 

"తేజగారికి నాపై కోపం వస్తే అక్కడే ఉన్న మా మదర్ ను పిలిచి అసహనాన్ని ప్రదర్శించేవారు. దాంతో మా మదర్ అందరి ముందూ నన్ను తిట్టేసేది. కెరియర్ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో నాకు సరైన గైడెన్స్ లభించలేదు. అందువలన నేను ఎక్కువ సినిమాలు చేయ లేకపోయాను" అని చెప్పారు. 

Santhoshi
Teja
Jai Movie
  • Loading...

More Telugu News