Nithin: 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్' ట్రైలర్ రిలీజ్

Extra Ordinary Man trailer released

  • 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్'గా నితిన్ 
  • దర్శకుడిగా వక్కంతం వంశీకి రెండో సినిమా 
  • ప్రధానమైన పాత్రలను కవర్ చేసిన ట్రైలర్   
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
  • డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల 

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మేన్' సినిమా రూపొందింది. నితిన్ అభిమానులంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆయన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించనున్నాడు.

దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండో సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన ఈ కంటెంట్ ను రెడీ చేసుకున్నాడు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామెడీ .. యాక్షన్ ప్రధానమైన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  

హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. నితిన్ సరసన నాయికగా ఈ సినిమాలో శ్రీలీల అలరించనుంది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక 'స్కంద' .. 'ఆదికేశవ' ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన శ్రీలీలకి కూడా హిట్ చాలా అవసరమే.

More Telugu News