Jayamangala Venkata Ramana: మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. సాక్షి సంతకం చేసిన రెండో భార్య

YSRCP MLC Jayamangala Venkata Ramana third marriage

  • మూడో పెళ్లి చేసుకున్న జయమంగళ వెంకటరమణ
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుజాతను పెళ్లాడిన ఎమ్మెల్సీ
  • కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరాడంబరంగా వివాహం

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను ఆయన పెళ్లాడారు. ఈ ఉదయం కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు ఒకటయ్యారు. వెంకటరమణ తొలి భార్య మృతి చెందడంతో... ఆయన సునీత అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే, కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన సునీత నుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా సుజాతను పెళ్లాడారు. మరోవైపు కొత్త దంపతులకు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వెంకటరమణకు తొలి భార్యతో ఒక కుమార్తె, రెండో భార్యతో ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ పెళ్లికి వెంకటరమణ రెండో భార్య సాక్షి సంతకం చేశారు. ఆయన కుమారుడు కూడా ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు.

Jayamangala Venkata Ramana
YSRCP
Third Marriage
  • Loading...

More Telugu News