Harom Hara: సింహం అంటే భయపెట్టాల్సిందే: 'హరోం హర' టీజర్ రిలీజ్

Harom Hara Teaser Released

  • సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'హరోం హర'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా
  • ఆసక్తిని పెంచుతున్న టీజర్  
  • కీలకమైన పాత్రలో కనిపిస్తున్న సునీల్
  • వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా రిలీజ్


సుధీర్ బాబు హీరోగా 'హరోం హర' సినిమా రూపొందింది. సుమంత్ జీ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి, జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన జోడీగా మాళవిక శర్మ నటించిన ఈ సినిమాకి, చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. 

1989లో చిత్తూరు జిల్లా పరిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు టీజర్ ను ప్రభాస్ .. తమిళంలో విజయ్ సేతుపతి .. మలయాళంలో మమ్ముట్టి .. కన్నడలో సుదీప్ .. హిందీలో టైగర్ ష్రాఫ్ రిలీజ్ చేశారు. 

 ఈ కథ విలేజ్ లో .. ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. సుబ్రమణ్యం పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. 'భయపడితే సింగాన్ని కూడా చేతికింద పెట్టుకుంటారు. అది భయపెడితేనే ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు" అనే డైలాగ్ టీజర్ కి హైలైట్. ఇతర ముఖ్యమైన పాత్రల్లో అర్జున్ గౌడ .. సునీల్ కనిపిస్తున్నారు.

More Telugu News