Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫొటో షూట్

Lavanya and Varun Tej photoshoot pics

  • ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న లావణ్య, వరుణ్
  • ఇటలీలో ఘనంగా జరిగిన పెళ్లి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా ఫొటోలు

'అందాల రాక్షసి' సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి... తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. పలు సినిమాలలో నటించిన లావణ్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆమె కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమ వివాహం చేసుకుని మెగా కోడలుగా మారిపోయింది. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తున్నారు. మరోవైపు ఇన్స్టాలో లావణ్య తన పేరును లావణ్య త్రిపాఠి కొణిదెలగా మార్చుకున్నారు.




Lavanya Tripathi
Varun Tej
Tollywood
Viral Pics
  • Loading...

More Telugu News