Bigg Boss: 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి రతిక .. ప్రశాంత్ ను బ్రతిమలాడినా చేకూరని ప్రయోజనం!

Bigg Boss 7 Update

  • బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ 
  • సెల్ఫ్ నామినేషన్ తో వచ్చేసిన అశ్వని 
  • ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ పాస్ 
  • తనని సేవ్ చేయమని అతనిని కోరిన రతిక
  • అవసరమైనప్పుడు ఉపయోగిస్తానన్న ప్రశాంత్  


బిగ్ బాస్ హౌస్ లో శని .. ఆదివారాలలో కలుపుకుని డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ముందుగా అశ్వని .. ఆ తరువాత రతిక బయటికి వచ్చేయ వలసి వచ్చింది. సెల్ఫ్ నామినేషన్ తో బయటికి వచ్చేసిన అశ్వని, పొరపాటుగా తాను తీసుకున్న నిర్ణయం వల్లనే బయటికి వచ్చేశానని నాగార్జునతో చెప్పింది.

ఆ తరువాత జరుగుతూ వచ్చిన ఎలిమినేషన్ చివరి రౌండ్ లో, అర్జున్ - రతిక మిగిలిపోయారు. ఎలిమినేషన్ రౌండ్ జరిగేటప్పుడు రతిక చాలా టెన్షన్ పడుతుందనే విషయం ఆడియన్స్ కి బాగా తెలుసు. అలాగే ఈ సారి కూడా ఆమె చాలా టెన్షన్ పడింది. ఎలిమినేషన్ ఎనౌన్స్ మెంట్ ను విని తట్టుకోలేను అన్నట్టుగా కనిపించింది.

అయితే 'ఎవిక్షన్ పాస్' వలన కలిగిన అధికారంతో, ఆ ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని ఎలిమినేషన్ బారి నుంచి కాపాడవచ్చని ప్రశాంత్ తో నాగార్జున అన్నారు. అయితే అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తానని ప్రశాంత్ సమాధానమిచ్చాడు. తనని సేవ్ చేయమని రతిక అతనిని రిక్వెస్ట్ చేయడం కనిపించింది. ప్రశాంత్ తానన్న మాటపైనే నిలబడటం వలన, హౌస్ నుంచి రతిక బయటికి రాక తప్పలేదు. 

Bigg Boss
Rathika
Arjun
Prashanth
  • Loading...

More Telugu News