Narendra Modi: విదేశాల్లో పెళ్లిళ్ల వేడుకలు జరుపుకోవడం అవసరమా?: ప్రధాని మోదీ ప్రశ్న

PM Requests Couples To Not Hold Weddings Abroad
  • ప్రముఖులు తమ ఇంట వివాహాలను భారత్‌లోనే నిర్వహించాలని మోదీ సూచన
  • తద్వారా భారతీయ సంపద దేశ సరిహద్దు దాటదని వ్యాఖ్య
  • పెళ్లి షాపింగ్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులకే ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి
ఇటీవల ప్రముఖుల కుటుంబాలు కొన్ని విదేశాల్లో వివాహ వేడుకలు నిర్వహించుకుంటున్న తీరుపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్‌లో’ ప్రసంగించిన మోదీ, భారతీయులు దేశంలోనే పెళ్లి వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. తద్వారా దేశ సంపద సరిహద్దు దాటకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

‘‘పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈమారు రూ.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని కొన్ని వాణిజ్య సంస్థలు చెబుతున్నాయి. కాబట్టి.. పెళ్లిళ్ల షాపింగ్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి..ఎంతో కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్న ఓ అంశం గురించి చెబుతాను. ఈ మధ్య కొన్ని కుటుంబాలు విదేశాల్లో వివాహాలు జరిపించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇది అవసరమా? ఈ విషయం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. ఈ వేడుకలను భారత్‌లోనే నిర్వహించుకోవాలి. మీకు కావాల్సిన వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేకపోవచ్చు కానీ వేడుకలను నిర్వహించే కొద్దీ అవీ అభివృద్ధి చెందుతాయి. ఇది ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన అంశం. నా ఆవేదన, బాధ వారికి చేరతాయనే అనుకుంటున్నా’ అని ప్రధాని మోదీ తెలిపారు.
Narendra Modi
Destination Weddings
Mann Ki Baat

More Telugu News