Siddaramaiah: మా హామీలపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah reacts to KCR remarks

  • కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు... కురిసిన ఓట్ల వర్షం
  • అదే ఫార్ములా తెలంగాణలోనూ పనిచేస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు
  • కర్ణాటకలో ఇప్పటివరకు హామీలు అమలు చేయడంలేదంటున్న బీఆర్ఎస్ నేతలు
  • కావాలంటే వచ్చి విచారణ చేసుకోవచ్చన్న కర్ణాటక సీఎం సిద్ధరామమయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ... అదే హామీల ఫార్ములాతో తెలంగాణలోనూ నెగ్గాలని ఆశిస్తోంది. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయడంలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై కర్ణాటక  సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 

ఐదు గ్యారంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని వెల్లడించారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వాటిని ఆమోదించామని స్పష్టం చేశారు. కావాలంటే, కర్ణాటకలో తమ హామీల అమలుపై విచారణ చేసుకోవచ్చని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

తమ హామీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ప్రతి రోజూ 62 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ హామీలతో మహిళలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. తన భార్య కూడా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నట్టు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Siddaramaiah
KCR
Congress
BRS
Karnataka
Telangana
  • Loading...

More Telugu News