SRH: ఖరీదైన ఆటగాడిని వదిలించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

SRH releases Harry Brook

  • ముగిసిన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్ గడువు
  • హ్యారీ బ్రూక్ ను విడుదల చేసిన సన్ రైజర్స్
  • గత వేలంలో బ్రూక్ ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్
  • 2023 ఐపీఎల్ లో పేలవంగా ఆడిన బ్రూక్

ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఆటగాళ్లను విడుదల చేసేందుకు, అట్టిపెట్టుకునేందుకు గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. గత సీజన్ లో ఘోర వైఫల్యం చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బలమైన జట్టును రూపొందించుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను విడుదల చేసింది. 

సన్ రైజర్స్ జట్టు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా ఉన్నాడు. అప్పట్లో సెంచరీల మోత మోగించిన బ్రూక్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, బ్రూక్ తన రేటుకు తగిన న్యాయం చేయకపోగా, దారుణంగా విఫలమయ్యాడు. కొన్ని మ్యాచ్ లకు అతడిని పక్కనబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో సన్ రైజర్స్ యాజమాన్యం ఒక సీజన్ కే అతడిని వదిలించుకుంది. 

అదే సమయంలో, అదీల్ రషీద్ (ఇంగ్లండ్), అకీల్ హోసీన్ (వెస్టిండీస్), కార్తీక్ త్యాగి, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మలను కూడా సన్ రైజర్స్ విడుదల చేసింది. 

ఇక, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, మార్కో యన్సెన్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఫజల్ హక్ ఫరూఖీ, ఉపేంద్ర సింగ్ యాదవ్, సన్వీర్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకుంది.

SRH
Harry Brook
Release
Retention
IPL-2024
  • Loading...

More Telugu News