Rahul Gandhi: ఆదిలాబాద్ సభా వేదికపైకి వచ్చిన అమ్మాయి... కాంగ్రెస్ గ్యారెంటీలు ఆమెతో చదివించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi public meeting in Adilabad

  • అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా? అని అడిగిన రాహుల్ గాంధీ
  • చెప్పగలనని అనడంతో ఆరు గ్యారెంటీలు చదివి చెప్పాలని సూచన
  • మహిళల కోసం కాంగ్రెస్ తీసుకొస్తున్న పథకాలను అమ్మాయితో చెప్పించిన రాహుల్ గాంధీ..  

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో ఓ అమ్మాయి వేదిక పైకి రాగా... ఆమెతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను చదివించారు. అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా? అని రాహుల్ ఆమెను అడిగారు.. దానికి ఆ అమ్మాయి చెప్పగలనని తెలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హిందీలో చెప్పాలని సూచించారు. వరలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆ అమ్మాయితో రాహుల్ గాంధీ చెప్పించారు.

ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేవలం గ్యారెంటీ మాత్రమే కాదని, కాంగ్రెస్ గెలిచాక వీటిని చట్టాలలా చేస్తామని చెప్పారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామన్నారు.

Rahul Gandhi
Congress
Telangana Assembly Election
  • Loading...

More Telugu News