Spirit: ప్రభాస్ 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనులు జూన్ లో ప్రారంభం

Prabhas Spirit movie pre production will start in June
  • 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్
  • ఈ సినిమాకు 'స్పిరిట్' అని నామకరణం
  • ఓ ఇంటర్వ్యూలో అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జూన్ లో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటికల్లా డైలాగులపై కసరత్తులు పూర్తవుతాయని వివరించారు. భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో 'స్పిరిట్' రూపొందనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ పోలీసాఫీసర్ అనగానే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'సలార్' చిత్రం తొలి భాగం డిసెంబరు 22న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Spirit
Prabhas
Sandeep Reddy Vanga
Pre Production
Tollywood

More Telugu News