IT Raids: పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

IT Raids in Pilot Rohit Reddy House

  • తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
  • ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
  • లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ ఎంపీ, వీ6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తాండూరు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం ఉదయం మణికొండలోని పైలట్ నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటికి అధికారులు చేరుకున్నారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. 

ఈ సోదాల్లో పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ. 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా పైలట్ సోదరుడి ఇంటిలో రూ.20 లక్షలు గుర్తించినట్లు చెప్పారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

IT Raids
Pilot Rohit
Mla Rohit Reddy
BRS
Telangana
assembly Elections
  • Loading...

More Telugu News