Kalyan Ram: కల్యాణ్ రామ్ 'డెవిల్' నుంచి 'లేడీ రోజీ' సాంగ్ వచ్చేస్తోంది... ప్రోమో ఇదిగో!

Lady Rosy song promo from Kalyan Ram starring Devil

  • కల్యాణ్ రామ్ హీరోగా డెవిల్
  • బ్రిటీష్ పాలన నాటి గూఢచారిగా కనిపించనున్న కల్యాణ్ రామ్
  • అభిషేక్ నామా దర్శకత్వంలో చిత్రం
  • నేడు పాటకు సంబంధించిన అప్ డేట్ ను పంచుకున్న చిత్రబృందం

నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త జంటగా నటిస్తున్న చిత్రం 'డెవిల్'. బ్రిటీష్ పాలన కాలం నాటి ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో కల్యాణ్ రామ్ ఓ గూఢచారిగా నటిస్తున్నారు. అభిషేక్ నామా చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, 'డెవిల్' చిత్రం నుంచి 'లేడీ రోజీ' అనే సాంగ్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. 

తాజాగా ఈ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బాణీలకు శ్రీహర్ష ఈమని సాహిత్యం సమకూర్చారు. హుషారుగా సాగే ఈ గీతాన్ని ప్రముఖ ర్యాప్ సింగర్ రాజకుమారి ఆలపించారు. కాగా, 'లేడీ రోజీ' పూర్తి పాటను నవంబరు 27న విడుదల చేయనున్నారు.

More Telugu News