Pawan Kalyan: బాధిత మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తోంది: జనసేన

YSRCP threatening fishermen not to meet Pawan Kalyan

  • విశాఖ హార్బర్ లో 49 పడవల దగ్ధం
  • బాధిత మత్స్యకారులను కలిసి ఆర్థికసాయం అందించనున్న పవన్
  • పవన్ ను కలవొద్దని వైసీపీ బెదిరిస్తోందన్న జనసేన నేతలు

విశాఖ హార్బర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు 49 పడవలు బూడిదైన సంగతి తెలిసిందే. బాధితులకు జనసేన పార్టీ సాయం అందించనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులను కలిసి ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ నేపథ్యంలో బాధిత మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ అందించే పరిహారం తీసుకుంటే ప్రభుత్వ నష్ట పరిహారం ఇవ్వబోమని మత్స్యకారులను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా లేదా పాక్షికంగా దగ్ధమైన బోట్లకు పవన్ రూ. 50 వేల చొప్పున అందజేయనున్నారు. బాధితులను ఆదుకోవడానికి పవన్ వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలా అని వైసీపీ కుట్రలు చేస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు.  

Pawan Kalyan
Janasena
YSRCP
Vizag Harbor

More Telugu News