Priyanka Gandhi: రేపు, ఎల్లుండి తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi to campaign in telangana for two days
  • రోజుకు మూడు సభల్లో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
  • రేపు రాత్రి ఖమ్మంలో బస చేయనున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు
  • ఎల్లుండి సభల అనంతరం ఢిల్లీకి పయనం
ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్ర, శనివారాలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాలకుర్తిలో, మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్‌లో, సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. 24వ తేదీ రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. 25న ఉదయం 11 గంటలకు పాలేరు, 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర ప్రచార సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకొని, గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు.
Priyanka Gandhi
Telangana Assembly Election
Congress

More Telugu News