SURYA: భారీ యాక్షన్ సీన్ షూటింగ్ లో గాయపడ్డ హీరో సూర్య

 Actor Surya injured in shooting

  • సూర్య 42వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'కంగువ'
  • చెన్నైలో షూటింగ్ సందర్భంగా సూర్య భుజంపై పడ్డ రోప్ కెమెరా
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్య

ప్రముఖ తమిళ సినీ నటుడు సూర్య గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, సూర్య 42వ ప్రాజెక్ట్ గా వస్తున్న 'కంగువ' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం థాయ్ లాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సూర్యపై రోప్ కెమెరా వచ్చి పడింది. 

ఈ ప్రమాదంలో ఆయన భుజానికి గాయమయింది. దీంతో షూటింగ్ ను ఆపేసిన యూనిట్ సభ్యులు సూర్యను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని... ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని తెలుస్తోంది. మరోవైపు రోప్ కెమెరా సూర్య భుజానికి కాకుండా తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెపుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

SURYA
Tollywood
Kollywood
Injury
  • Loading...

More Telugu News