Jyothika: ప్రేమలో పడటం చాలా ఈజీ... కానీ..: జ్యోతిక

Actress Jyothika on love

  • ప్రేమ వివాహం చేసుకున్న సూర్య, జ్యోతిక
  • బంధంలో ఉన్నప్పుడు చిన్న విషయాలను పట్టించుకోకూడదన్న జ్యోతిక
  • ఏళ్లు గడిచే కొద్దీ ప్రేమ బలపడుతుందని వ్యాఖ్య

ప్రముఖ సినీ నటులు సూర్య, జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో పడటం చాలా ఈజీ అని... కానీ, ప్రేమలో ఎదగడం ముఖ్యమని చెప్పారు. దాంపత్య జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది... మన జీవిత భాగస్వామిని గౌరవించడం, అభినందించడమని అన్నారు. ఒక బంధంలో ఉన్నప్పుడు చిన్ని విషయాలను పట్టించుకోకూడదని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ ప్రేమ బలపడుతుందని అన్నారు. 

సూర్యతో కలిసి తాను ఏడు చిత్రాల్లో నటించానని జ్యోతిక తెలిపారు. అందరికీ సూర్య ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు. తన భావాలకు కూడా ఎంతో విలువ ఇస్తారని తెలిపారు. అందుకే తనపై ఉన్న ప్రేమను సూర్య బయట పెట్టగానే తాను అంగీకరించానని... సూర్యను పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

Jyothika
Surya
Love
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News