Bandi Sanjay: నువ్వు మరో కేఏ పాల్: మంత్రి గంగులపై బండి సంజయ్ విమర్శలు

Gangula Kamalakar is another KA Paul says Bandi Sanjay

  • గంగులకు తొలుత బీఫామ్ కూడా ఇవ్వలేదన్న బండి సంజయ్
  • ఓటర్లకు లక్ష సెల్ ఫోన్లు పంచుతున్నారని ఆరోపణ
  • నీ ఆస్తులు, నా ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాల్

మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నేత బండి సంజయ్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గంగుల అవినీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా వాటా ఉందని సంజయ్ ఆరోపించారు. టికెట్లు అమ్ముకున్నానని తనపై గంగుల ఆరోపణలు చేస్తున్నారని... టికెట్లు అమ్ముకోవడానికి తాను అధ్యక్షుడిని కాదని చెప్పారు. నువ్వు మరో కేఏ పాల్ అని... తొలుత నీకు బీఫామ్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ లో గంగుల ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు లక్ష సెల్ ఫోన్లను పంచుతున్నారని ఆరోపించారు. నీ ఆస్తులు, నా ఆస్తులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే... కేసీఆర్ ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు.

Bandi Sanjay
BJP
Gangula Kamalakar
KCR
BRS
  • Loading...

More Telugu News