Actor Manas: ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ వివాహం

Bigg Boss fame Manas marriage

  • చెన్నైకి చెందిన శ్రీజను పెళ్లాడిన మానస్
  • విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా పెళ్లి
  • హాజరైన సినీ, టీవీ ప్రముఖులు

బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటుడు మానస్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా పెళ్లి వేడుక జరిగింది. చెన్నైకు చెందిన శ్రీజను ఆయన పెళ్లాడారు. వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు తెలుగు సీరియల్స్ లో మానస్ నటించారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ అయిన మానస్... తన ఆటతో ప్రేక్షకులను అలరించారు. ఓంకార్ తెరకెక్కించిన 'మ్యాన్షన్ 24' సిరీస్ లో కూడా మానస్ నటించారు. మరోవైపు, కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Actor Manas
Marriage
  • Loading...

More Telugu News