Varla Ramaiah: పొన్నవోలు తీరు న్యాయవృత్తికే కళంకం: వర్ల రామయ్య

Varla Ramaiah lashes out at ponnavolu sudhakar reddy

  • ఏ అడ్వకేట్ జనరల్ కూడా న్యాయవ్యవస్థను విమర్శించలేదన్న వర్ల రామయ్య
  • జగన్ కళ్లల్లో ఆనందం కోసం పరిధి దాటుతున్నారని మండిపాటు
  • పొన్నవోలుకు చట్టబద్ధంగానే మూల్యం చెల్లిస్తామని వ్యాఖ్య

అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరుపై టీడీపీ పాలి‌ట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరు న్యాయవృత్తికే కళంకమని తాజా మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఇంత బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి న్యాయస్థానాన్ని నిందించలేదు. తనకీ పదవి ఇచ్చిన జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పొన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఏకవచనంతో సంబోధించడం పొన్నవోలు అహంకారానికి నిదర్శనం. స్కిల్ కేసులో  నిధులు దారి మళ్లినట్టు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అంటే.. ఆయనను నిందించే వ్యాఖ్యలు చేయడం సబబా? పొన్నవోలు లక్ష్యం న్యాయం, సత్యం, ధర్మం కాదు.. చంద్రబాబుకి శిక్ష పడేలా చేయడమే అతడి ఏకైక లక్ష్యం.

‘‘పొన్నవోలుకు దమ్ముంటే స్కిల్ కేసులో ‘‘సీక్రెట్ అకౌంట్స్’’కు డబ్బులు దారి మళ్లాయని నిరూపించగలరా? ధైర్యముంటే ఈ విషయంలో నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? జాతీయ సంపదలాంటి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ కళ్లల్లో ఆనందం చూడాలన్న తాపత్రయం పొన్నవోలుది. చట్టం పరిధి దాటి వ్యవహరిస్తున్న పొన్నవోలుకు భవిష్యత్తులో చట్టబద్ధంగానే తగిన మూల్యం చెల్లిస్తాం’’ వర్ల రామయ్య హెచ్చరించారు. 

Varla Ramaiah
Ponnavolu Sudhakar Reddy
YS Jagan
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News