Joju George: ఓటీటీలో గురు .. శుక్రవారాల్లో జరిగే రచ్చ ఒక రేంజ్ లో ఉందే!

- ఈ నెల 23న నెట్ ఫ్లిక్స్ లో 'పులిమడ'
- అదే రోజున జియో సినిమాలో 'గుడ్ ఓల్డ్ డేస్'
- 24వ తేదీన సోనీలివ్ లో మలయాళ మూవీ 'చావెల్'
- ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి 'ఒడియన్'
- అమెజాన్ ప్రైమ్ సెంటర్ కి న్యూ సిరీస్ గా 'ది విలేజ్'
ఈ గురు .. శుక్రవారాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ పై సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. హాలీవుడ్ ... బాలీవుడ్ సినిమాలు .. వెబ్ సిరీస్ ల సంగతి అలా ఉంచితే, సౌత్ నుంచి కూడా చాలా సిరీస్ లు .. సినిమాలు ఓటీటీ ట్రాక్ పైకి వెళ్లడం కనిపిస్తుంది. గురువారం రోజున మలయాళ మూవీ 'పులిమడ' ప్రేక్షకుల ముందుకు రానుంది. జోజు జార్జ్ - ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున తెలుగు వెబ్ సిరీస్ 'గుడ్ ఓల్డ్ డేస్' జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.


