R Krishnaiah: ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు: ఎంపీ ఆర్.కృష్ణయ్య

R Krishnaiah praises Jagan

  • కుల గణన చేయాలన్న జగన్ నిర్ణయం చాలా గొప్పదన్న కృష్ణయ్య
  • చరిత్రలో జగన్ పేరు నిలిచిపోతుందని వ్యాఖ్య
  • విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని కితాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని... చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. 

గుడిసెల్లో ఉండేవాళ్లు కూడా జగన్ పాలనలో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని... తమకు సరైన పదవులు కూడా ఇవ్వకుండా అగౌరవపరిచారని విమర్శించారు.

R Krishnaiah
Jagan
YSRCP
  • Loading...

More Telugu News